జెలెన్‌స్కీ సొంత నగరం క్రైవీ రిహ్‌పై రష్యా దాడులు

-

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆయన సొంత నగరం క్రైవీ రిహ్‌పై రష్యా సోమవారం అర్ధరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌ భవనం సహా పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉండొచ్చని ఆ నగర మేయర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోగా.. దాదాపు 25 మంది గాయపడినట్లు డెనిప్రోపెట్రోవ్స్క్‌ గవర్నర్‌ షెర్హీలిసాక్‌ పేర్కొన్నారు. ఇక దాడిలో దెబ్బతిన్న ఐదంతస్తుల భవనం ఇప్పటికీ మంటల్లోనే చిక్కుకొని ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన చిత్రాలను టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు.

మరోవైపు కీవ్‌పై కూడా రష్యా దాడులను కొనసాగించింది. కానీ, ఆ నగరానికి రక్షణగా ఉన్న ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు పలు క్షిపణులను కూల్చివేశాయని కీవ్‌ ప్రాంత మిలిటరీ రీజియన్‌ ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు నగరాల్లో నిన్న మొత్తం గగనతల రక్షణ వ్యవస్థ సైరన్‌ మోగుతూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news