బాలీవుడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన బన్నీ..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తన రేంజ్ ఏంటో బాలీవుడ్ కి కళ్ళకు కట్టినట్టు చూపించేశారు. ఆనాటి నుంచి ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైరల్ అవుతున్న అల్లు అర్జున్ ఈవెంట్ ఏదైనా సరే వెళ్ళిన చోట తన లుక్ తో క్రేజ్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు మరొకసారి ఒక బాలీవుడ్ ప్రైవేట్ ఈవెంట్ లో కూడా సందడి చేశారు. ఇకపోతే అమీర్ ఖాన్ , హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోల మధ్య తన పైనే అందరి దృష్టి పడేలా చేసుకున్నారు.

ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ మధు మంతెన ఇన్విటేషన్ మేరకు ఆయన పెళ్లికి వెళ్లినాయనా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల మధ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. హృతిక్ , అమీర్ ఖాన్ లు ప్రత్యేకంగా అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి మరి పలుకరించే రేంజ్ లో ఆయన చేరుకున్నారని చెప్పాలి. ఇకపోతే ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. బన్నీ అభిమానుల సైతం ఖుషీ అవుతున్నారు.

ఇకపోతే దాంతోపాటే తన క్రేజ్ తో బన్నీ బాలీవుడ్ మోత మోగించారని అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ఇటీవలే ఏషియన్ సంస్థతో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మించిన విషయం తెలిసిందే. జూన్ 16వ తేదీన ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమాతో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించనున్నారు. ఇక వ్యాపారంగంలో బన్నీ ఏ విధంగా సక్సెస్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news