ఆ విషయంలో తమన్నా ముందు విజయ్ వర్మ దిగదుడుపే..!

-

ఎట్టకేలకు అటు తమన్నా ఇటు విజయ్ వర్మ ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నాము అంటూ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళితే ఈ ఏడాది మొదటినుంచి చట్టపట్టలేసుకొని తిరుగుతూ మీడియా కంటపడిన వీరిద్దరూ తమ మధ్య ఏమీ లేదని వారించినప్పటికీ మీడియా మాత్రం వీరిని వదల్లేదు. కానీ ఎట్టకేలకు అటు తమన్న ఇటు విజయవర్మ ఇద్దరూ కూడా తాము ఇద్దరం డేటింగ్ లో ఉన్నామంటూ ఒప్పుకున్నారు. ఇకపోతే ఒక్క ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్లో తమన్నా ముందు విజయవర్మ చాలా తక్కువ అనే వార్తలు వినిపిస్తున్నాయి.

తమన్నా ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఆమె ఒక డైమండ్ వ్యాపారి కూతురు.. పుట్టుకతోనే శ్రీమంతురాలు నటన మీద ఇష్టంతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె కేవలం నటిగానే రూ.120 కోట్ల వరకు ఆస్తులు సంపాదించింది. మరొకవైపు విజయ్ వర్మ గత ఆరు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాడు. నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. హైదరాబాది అయిన ఈయన తెలుగులో నాని ఎంసీఏ సినిమాలో నటించారు. అలాగే హిందీలో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ మరింత బిజీగా మారిపోయాడు.

ఇక ఆయన రూ.20 కోట్లు మాత్రమే కూడపెట్టారని సమాచారం. ఒక విధంగా చూసుకుంటే విజయ్ వర్మ కంటే ఆరు రెట్లు తమన్నా సంపాదన ఎక్కువ అని ఆమె ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. ఇకపోతే వీరిద్దరూ ఫైనాన్షియల్ బ్యాగ్రౌండ్ చూసుకోకుండా మనసుకు నచ్చిన విధంగా ముందుకు వెళ్లాలని.. అందుకోసమే త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news