బాబుకు లక్ష..కుప్పంకు శిక్ష.!

-

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో లక్ష మెజారిటీతో గెలవడమే టి‌డి‌పి అధినేత చంద్రబాబు టార్గెట్. కుప్పంని వైసీపీ కైవసం చేసుకోవాలని చూస్తున్న నేపథ్యంలో బాబు..ఈ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. బాబు బాగానే లక్ష టార్గెట్ గా పెట్టుకున్నారు..కానీ అదేదో అక్కడి ప్రజల బాధ్యత అన్నట్లు మాట్లాడుతున్నారు. తనని గెలిపించుకోకపోతే..కుప్పం బాగుపడదు అన్నట్లు చెబుతున్నారు. దీంతో బాబు లక్ష మెజారిటీ పెట్టుకోవడం..కుప్పం ప్రజలకు పెద్ద శిక్షలా ఉందని అనుకుంటున్నారు.

1989 నుంఛి 2019 వరకు వరుసగా 7 సార్లు కుప్పం బరిలో బాబు గెలుస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంని గట్టిగా టార్గెట్ చేసింది..దీంతో బాబుకు ఎదురుదెబ్బలు తగిలాయి. కనీసం ఆయన ఎప్పుడు కూడా నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్ళేవారు కాదు..నామినేషన్ ఫైళ్ళ మీద సంతకం పెట్టి..కార్యకర్తల చేత నామినేషన్ వేయించేవారు. అలాంటి బాబుని ఇప్పుడు పదే పదే కుప్పం వెళ్ళేలా చేశారు జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పం టార్గెట్ గా దూసుకెళుతున్నారు.

కుప్పం పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచారు..కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు. దీంతో బాబు అలెర్ట్ అయ్యారు. కుప్పం పర్యటనలు చేస్తూ ఉన్నారు. అక్కడ తన బలం తగ్గకూడదని చూసుకుంటున్నారు. తాజాగా కూడా కుప్పం వెళ్ళి..ఈ సారి లక్ష మెజారిటీ రావాలని టార్గెట్ పెట్టుకున్నారు.

అయితే మళ్ళీ  టి‌డి‌పి గెలిస్తేనే కుప్పం అభివృద్ధి అవుతుందని, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, తనని మళ్ళీ గెలిపించాలని అంటున్నారు. అంటే 7 సార్లు గెలిచారు…ముందు అభివృద్ధి చేయలేదా? ఆదర్శ నియోజకవర్గంలో ఎందుకు చేయలేదు అని ప్రశ్నలు వస్తున్నాయి. బాబు బాగానే లక్ష టార్గెట్ గా పెట్టుకున్నారు..కానీ అది కుప్పం ప్రజలకు శిక్షగా మారిపోయిందని అంటున్నారు. గత ఎన్నికల్లోనే మెజారిటీ భారీగా తగ్గించారు. మరి ఈసారి కుప్పంలో ఏం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news