“రా” కొత్త చీఫ్ గా రవి సిన్హా

-

భారత కీలక నిఘా విభాగమైన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ “రా” కు కొత్త చీఫ్‌ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న సమంత్‌ కుమార్‌ గోయల్‌ పదవీ విరమణ చేయనున్నారు. భారత నిఘా విభాగమైన రీసెర్చి అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ అధిపతిగా 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రవిసిన్హాను ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయానికి ‘నియామకాలపై కేంద్ర మంత్రుల కమిటీ’ ఆమోద ముద్ర వేసింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ పదవిలో కొనసాగుతున్న సమంత్‌ కుమార్‌ గోయల్‌ రిటైర్మెంట్‌ తీసుకోనున్నారు. ఆయనకు ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించింది. విదేశాల్లో అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను ‘రా’ నిర్వహిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌కు చెందిన రవి గత ఏడేళ్లుగా ‘రా’ ఆపరేషనల్‌ విభాగంలో అధిపతిగా సేవలు అందిస్తున్నారు.

ఆయన దిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయన వ్యక్తిగత వివరాలు చాలా వరకు గోప్యంగా ఉన్నాయి. భారత ఇంటెలిజెన్స్‌ విభాగంలో ప్రతిభావంతుడిగా ఆయనకు పేరుంది. ఆయన వివిధ విభాగాల్లో పనిచేశారు. పొరుగు దేశాల్లో జరిగే పరిణామాలపై మంచి పట్టుంది. ముఖ్యంగా ఆయన జమ్ముకశ్మీర్‌, ఈశాన్య భారత్‌, వామపక్ష తీవ్రవాదంపై పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news