సముద్రతీరాన పూరీ జగన్నాథ రథయాత్ర సైకత శిల్పం

-

సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గురించి తెలియని వారుండరు. ప్రతి ప్రత్యేకమైన రోజుని.. ప్రత్యేక వేడుకను పురస్కరించుకుని.. ప్రముఖుల జన్మదినోత్సవం.. మహాత్ముల జయంతి.. వర్ధంతి.. ఇలా సందర్భమేదైనా.. తన భావాన్ని సైకత శిల్పం రూపంలో చూపిస్తూ ఉంటారు సుదర్శన్. నేడు జన్నాథ రథయాత్ర సందర్భంగా ఆయన ఈ వేడుకను పురస్కరించుకుని కూడా ఓ సైకత శిల్పాన్ని రూపొందించారు.

దేశవ్యాప్తంగా జగన్నాథ స్వామి ఆలయాల్లో కోలాహలం నెలకొంది. ఇవాళ జగన్నాథుని రథయాత్ర నిర్వహించనుండటంతో భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ .. సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు. బంగాళాఖాతం తీరానగల పూరీ బీచ్‌లో పూరీ జగన్నాథ రథయాత్రను ప్రతిబింబించేలా సైకత శిల్పాన్ని రూపొందించారు.

ఈ సైకత శిల్పం రూపకల్పనలో రకరకాల రంగులను పట్నాయక్‌ వినియోగించారు. అదేవిధంగా 250 కొబ్బరికాయలను కూడా సుదర్శన్‌ పట్నాయక్‌ ఈ సైకత శిల్పం కోసం ఉపయోగించారు. ప్రస్తుతం ఈ సైకత శిల్పం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news