కమలంలో ఇదేం లొల్లి..భారీ డ్యామేజ్ చేసారే.!

-

ఏదో అనుకుంటే ఏదో అవుతుందన్నట్లుగా తెలంగాణ లో బి‌జే‌పి పరిస్తితి ఉంది. మొన్నటివరకు రేసులో దూసుకొచ్చింది..కానీ ఇప్పుడు ఒక్కసారిగా వెనుకబడింది. బి‌జే‌పికి అసలు బలమైన వలసలు ఆగిపోయాయి. కీలక నేతలు సైలెంట్ అయ్యారు. అంత ఎఫెక్టివ్ గా పార్టీ కార్యక్రమాలు చేయడం లేదు. పైగా కాంగ్రెస్ రేసులోకి రావడం బి‌జే‌పికి పెద్ద మైనస్. ఇదే అనుకుంటే పార్టీలో జరిగే కొన్ని పొరపాట్లు టి‌డి‌పికి పెద్ద తలనొప్పిగా మారాయి.

దీని వల్ల బి‌జే‌పికి పెద్ద మైనస్ అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. అటు సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ లాంటి వారికి బండితో పడటం లేరు. వీరి మధ్య పోరు నడుస్తుంది. దీంతో బి‌జే‌పి కేడర్ లో అయోమయం నెలకొంది. ఇదే సమయంలో తాజాగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తాజాగా సోషల్ మీడియాలో విడుదలైన ఓ వీడియోలో  సోయం..తన ఎంపీ నిధులని సొంత ఇల్లు కట్టుకోవడానికి, తన తనయుడు పెళ్లి చేయడానికి వాడినట్లు చెప్పారు. అలాగే పార్టీ బలోపేతానికి ఉపయోగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రజల కోసం వినియోగించాల్సిన ఎంపీ నిధులు..ఇలా సొంతానికి వాడుకోవడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సోయం ఊహించని వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేశారని, ఆదిలాబాద్ బి‌జే‌పి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్..ఈ ఇద్దరు తనపై కుట్ర చేశారని, తన మాటలని వక్రీకరించి, వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని, అయిన ఎంపీన నిధులని సొంతానికి వాడుకోవడానికి లేదని, కలెక్టర్ పర్మిషన్ కావాలని చెప్పారు.

ఇలా సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేయడంతో రచ్చ మొదలైంది. అటు శంకర్, రమేశ్ సైతం కౌంటరుగా ప్రెస్ మీట్ పెట్టాలని చూశారు గాని..అధిష్టానం వారించడంతో తగ్గారు. అయినా ఈ అంశం బి‌జే‌పిలో చిచ్చు రేపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news