ప్రభుత్వం కీలక నిర్ణయం.. 141 మంది సీఐల‌కు డీఎస్పీలుగా ప‌దోన్నతులు

-

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్‌శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 141 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజేపీ అంజన్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 141 మంది సీఐలను సివిల్ డీఎస్పీలుగా ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన పోలీసు అధికారులకు పోలీస్ బాస్ అభినందనలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజతలు తెలిపారు. ఆయన తన అభినందనలు ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు.

Ministry of Home Affairs pats Telangana Police - Telangana Today

డీఎస్పీలుగా ప్ర‌మోష‌న్లు పొందిన వారంద‌రికీ రాష్ట్ర డీజీపీ అంజ‌నీ కుమార్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు డీజీపీ అంజ‌నీ కుమార్. మొత్తంగా కొంతకాలంగా ఎదురుచూస్తున్న సీఐల పదోన్నతుల కల నెరవేరింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news