రాష్ట్రంలో వైసీపీ ప్రబుత్వం ఏర్పాటై ఐదు మాసాలు కూడా పూర్తికాలేదు. కానీ, జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏ ఎండకు ఆగొడుగు పడుతున్న చందంగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. జిల్లాల్లో పార్టీని డెవలప్ చేయాల్సిన కొందరు సీనియర్లు.. తమ ఆధిపత్యం కోసం .. ముఠాలను ప్రోత్సహిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా చిత్తూరు వైసీపీలో జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి ఇలానే ఉందా? ఉంటుందా? అలా అయితే, జగన్ ఏంచేస్తున్నట్టు అనే సరికొత్త చర్చకు ఆస్కారం ఇచ్చింది. విషయంలోకి వెళ్తే.. చిత్తూరు వైసీపీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
చిత్తూరులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క కుప్పం మినహా .. మిగిలిన అన్ని చోట్లా వైసీపీ విజయం సాధిం చింది. తిరుపతి ఎంపీ స్థానం కూడా వైసీపీ బుట్టలో వేసుకుంది. అయితే, ఇదంతా కేవలం స్థానిక నాయకుల వల్ల మాత్రమే సాధ్యమైందా? అనేది కీలక ప్రశ్న. దీనికి ఒకటే సమాధానం పార్టీ అదినేత దూకుడు, స్థానికం గా నాయకుల బలాబలాలపైనే ఆధారపడి పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, ఇక్కడ నుంచి మంత్రిగా మా త్రం పుంగనూరు ఎమ్మెల్యే, సీఎం జగన్‌కు దూరపు బంధువు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి బెర్త్ దక్కించుకు న్నారు. పార్టీలో ఆయన కొన్నేళ్లుగా చక్రం తిప్పుతున్నారు. అధినేత తనవాడే కావడంతో ఆయన మాటకు కూడా ఎదురు లేకుండా ఉంది.
అయితే, పెద్దిరెడ్డి పార్టీకి అనుకూలంగా ఉండే పనిని ప్రోత్సహించాల్సి ంది పోయి.. కూటమి రాజకీయాల కు, గ్రూపు రాజకీయాలకు తెరదీస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ ఈ జిల్లాలో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టే నాయకులు వైసీపీలో లేరు. అయినాకూడా ఆయన తన ఆధిపత్య రాజకీయం కోసం స్థానికంగా ఉన్నవారిని గ్రూపులుగా విభజిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కో-కన్వీనర్, వైసీపీ నాయకుడు బుల్లెట్ సురేష్, చిత్తూరు నగర వైసీపీ అధ్యక్షుడు లాయర్ చంద్రశేఖర్, వైసీపీ జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు పీవీ గాయత్రిదేవిలు.. ఈ ముగ్గురు మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలో ఎవరికివారు వేర్వేరుగా నిర్వహించారు.
ఎవరికి వారుగా మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడమేంటి? అనేది ఇప్పుడు కీలక ప్రశ్న. ఆయనపై అభిమానంఉంటే.. అందరూ కలసి కట్టుగా కార్యక్రమం నిర్వహిస్తే.. బాగుండేది కదా? ఇలా వేర్వేరుగా ఆయనకు జన్మదిన కార్యక్రమాలు ఎందుకు నిర్వహించారు? అనే విషయంపై రాజకీయ విశ్లేషకులు దృష్టి పెట్టారు. ఈ మూడు గ్రూపులను కూడా పెద్దిరెడ్డి ప్రోత్సహిస్తున్నారా? లేక ఏమైనా విశేషం ఉందా? అనే ఆలోచన చేస్తున్నారు. నిజానికి పార్టీని అభివృద్ధి చేయాలంటే.. అందరినీ కలిసికట్టుగా కలుపుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది కానీ, ఇలా చేయడం వల్ల పార్టీ పరిస్తితి పలచన కాదా? అనేది ప్రశ్న. మరి పెద్దిరెడ్డి ఏం చేస్తారో చూడాలి.