వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా.. ‘బవాల్’. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జులైలో నేరుగా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది. అయితే అంతకంటే ముందు పారిస్‌లోని ఈఫిల్ టవర్‌పై ఈ మూవీని ప్రదర్శించబోతున్నట్టు సినీ వర్గాల్లో టాక్.
‘‘జులై రెండో/మూడో వారంలో ప్రీమియర్ వేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈఫిల్ టవర్‌పై సందడి చేయనున్న తొలి భారతీయ చిత్రంగా ‘బవాల్’ రికార్డుకెక్కనుంది. చిత్ర బృందంతో పాటు సినీ ప్రియులు, ఫ్రెంచ్ ప్రతినిధులు ఈ ప్రీమియర్‌కి హాజరుకానున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అధిక భాగం పారిస్‌లోనే జరిగింది. కథలో అదొక భాగం’’ అని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. ‘బేఫికర్’లాంటి ఇండియన్ సినిమా ట్రైలర్లు ఈఫిల్ టవర్‌పై ప్రదర్శితమైన సంగతి తెలిసిందే. పూర్తి సినిమా ప్రీమియర్ కానుండడం ఇదే తొలిసారి. ప్రేమ, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో బవాల్ సినిమా రూపొందింది.