ఏపీ యువతకు పవన్ కళ్యాణ్ తీవ్రవాదం నేర్పిస్తున్నాడని ఫైర్ అయ్యారు రాం గోపాల్ వర్మ. నిన్న పవన్ కళ్యాణ్‌చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వర్మ. చివరికి రాజకీయ క్యాంపైన్లు ఇక్కడికి చేరాయి.. తననుకున్నదాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారం లో కొస్తే పీక పిసికేసి చంపేస్తా , బట్టలూడదీసి పరిగెత్తిస్తా ,చర్మం వొలిచేస్తా , లాంటి హింసాత్మికమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో ఎవరూ అనుండరన్నారు వర్మ.
హిట్లర్, సద్దాం, కిం జొంగ్ ఉన్ తో సహా ఇంకో విషయమేంటంటే అధికారం లోకి వస్తే నరికేస్తాను అంటె ఇప్పుడు అధికారం లో వున్న పార్టీ అది చేయచ్చు అని చెప్పడమా ? అంటూ ఫైర్ అయ్యారు వర్మ. ఏది ఏమైనా ఒక ప్రజా స్వామ్య దేశంలో తన ఫాలోయర్స్ కి డైరెక్ట్ గా ఇంత బ్రూటల్ వయోలెన్స్ ని ప్రభోదించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం అంటూ విమర్శలు చేశారు. ఇలాంటి హింస ని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే ఆ మీటింగ్లకొచ్చ్చే ఆ యువకులు భవిశత్త్తులో ఏమవ్వాలనుకుంటున్నాడో ఆ పవన్ కళ్యాణ్ కే తెలియాలని నిప్పులు చెరిగారు ఆర్జీవీ.