కూతురితో షారుక్ ఖాన్ సినిమా.. ఆనందంలో ఫ్యాన్స్

-

బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓవైపు తన కెరీర్​ను ప్లాన్ చేసుకుంటూనే.. మరోవైపు తన పిల్లల కెరీర్​పై ఫోకస్ చేస్తున్నాడు. ఇటీవలే షారుక్ కూతురు సుహానా నెట్​ఫ్లిక్స్​ రూపొందిస్తున్న ది ఆర్చీస్ అనే వెబ్​ సిరీస్​లో నటించిన విషయం తెలిసిందే. ఇక కుమారుడు ఆర్యన్ ఖాన్.. ఇటీవలే ఓ ఫ్యాషన్ బ్రాండ్ షురూ చేశాడు. అంతే కాకుండా ఓ యాడ్​ను డైరెక్ట్ చేశాడు. ఆర్యన్ తన ఫోకస్ అంతా స్క్రిప్ట్ రైటింగ్.. డైరెక్షన్​పై పెట్టాడు.

అయితే తాజాగా షారుక్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి మొదటిసారి ఓ చిత్రం కోసం కలిసి పనిచేయబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌, షారుక్‌ కలయికలో మరో సినిమా రానుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మార్ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి. స్క్రిప్ట్‌ డిమాండ్‌ కారణంగా ఇందులో షారుక్‌, సుహానా కలిసి నటించబోతున్నారట. ‘ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news