తెలంగాణలో ఎన్నికలంటే, 20 కోట్లా, 30 కోట్లా అనే పరిస్థితి వచ్చిందని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లల చేష్టలుగా వ్యవహరిస్తే మరింత నష్టం జరుగుతుందని.. ఎన్నికల నిర్వహణ ఆషామాషి కాదని చెప్పారు. సభలు, సమావేశాలు హడావుడి మామూలేనని.. వాస్తవరూపం లో క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువవ్వాలని తెలిపారు జగ్గారెడ్డి.
ఇప్పటివరకైతే అలాంటిది జురుగుతున్నట్లు గా లేదని… తెలంగాణలో ఎన్నికలంటే, 20 కోట్లా, 30 కోట్లా అనే పరిస్థితి వచ్చిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరాలలో ఉన్న లోపాలు, జరుగుతున్న పొరపాట్లు, జరగబోయే నష్టం రాహుల్ గాందీ కీ నేరుగా చెప్తానని… ఈ సారి కూడా అధికారంలోకి రాకపోతో, చాలామంది రాజకీయ జీవితాలు దెబ్బతీంటాయని వివరించారు. ప్రజలకు చేద్దామనుకున్న పనులను కూడా చేయలేమని.. ఇప్పటికే నష్టం జరిగిందని వెల్లడించారు. జైపాల్ రెడ్డి మేధావులందరూ కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ కోలుకోలేనంత నష్టం చేశారన్నారు.