ఎంఐఎం పార్టీ కావాలని డిమాండ్ చేస్తున్న ముస్లిం బంధుపై బీజేపీ నేత విజయశాంతి సెటైర్లు వేశారు. దళితబంధు లెక్క ముస్లింబంధు డిమాండ్ చేస్తున్న ఎంఐఎం పార్టీ… బీసీబంధును డిమాండ్ చెయ్యదని ఫైర్ అయ్యారు. అది ఆ పార్టీ విధానం కావచ్చు.
అయితే, హిందూ మెజారిటీ బీసీలకు 10 లక్షల రూపాయల బీసీబంధు పథకాన్ని అమలు చెయ్యవలసిన ఆలోచన, పై పథకాల చర్చలో బీఆరెస్ ప్రభుత్వ కనీస బాధ్యత ఉందని చురకలు అంటించారు. ఎంఐఎం తెలంగాణల 50 కాదు, 119 స్థానాలల్ల పోటీ చేసినా అది ఆ పార్టీ ఇష్టమని చెప్పారు. ఓట్ల లాభనష్టాలు బీఆరెస్, కాంగ్రెస్, ఎంఐఎంకు పరిమితమైన అంశాలు ఉన్నాయన్నారు.
ఎందుకంటే ఆ 3 పార్టీలూ సయామీలు. ఎప్పుడైనా ఒక్కటవడం గత, వర్తమాన, రేపటి వాస్తవం అని తెలిపారు. అయితే, బీజేపీ తన జాతీయవాద విధానంలో పనిచెయ్యటం మార్పు లేని ఒక విధానం అనేది కార్యకర్తలకు, ప్రజలకు సుస్పష్టం అని పోస్ట్ పెట్టారు విజయ శాంతి.