జనసేన పార్టీలోకి ఏపీ మంత్రి విశ్వరూప్ వెళుతారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాను జనసేనలోకి వెళ్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై మంత్రి విశ్వరూప్ క్లారిటీ ఇచ్చారు. నాకు పార్టీ మారే ఉద్దేశమే లేదు. నా వాక్యాలను వక్రీకరించారు. నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. కేబినెట్ మంత్రిగా తీసుకుని జగన్ గౌరవించారు.
ఆయనకు నేను అండగా ఉంటా. కొందరు పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాగా, ఇటీవల పవని కళ్యాణ్ సీఎం కావాలని నేను కోరుకుంటున్నా అంటూ ఏపీ మంత్రి విశ్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవని కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులే కాదు….నేను కోరుకుంటున్నానని చెప్పారు.సీఎం కావాలంటే పవన్ 175 స్థానాలో పోటి చేసి విజయం సాధించాలని… లేదంటే కనీసం 100 స్థానాల లో అయినా పోటి చేసి 50 సీట్లలో గెలిచి అయినా సీఎం అవ్వడానికి ప్రయత్నం చెయ్యాలని చురకలు అంటించారు ఏపీ మంత్రి విశ్వరూప్.