ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

-

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..  వైద్య విధాన పరిషత్తు హాస్పిటల్స్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం ఖాళీగా ఉన్న 331 పోస్టులకు జూలై 5, 7, 10న ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తామని ఏపీ మెడికల్ సర్వీసెస్ నియామక మండలి కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.

పూర్తి వివరాలను వెబ్ సైట్ లో ఉంచామని… ఒప్పంద నియామకాల స్థానికత, రోస్టర్ విధానం నుంచి సడలింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, వార్డు సచివాలయాల్లోని శానిటరీ, పర్యావరణ కార్యదర్శుల పనివేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు లేదా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని జాబ్ చార్ట్ సవరించారు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు అవసరాన్ని బట్టి సచివాలయాల్లో, క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news