రీ రిలీజ్ లో కూడా రికార్డు బ్రేక్ చేసిన “ఈ నగరానికి ఏమైంది”..!

-

పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తరుణ్ భాస్కర్ “ఈ నగరానికి ఏమైంది”అనే సినిమాతో భారీగా ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో పెద్దగా విజయం అందుకోలేదు కానీ మంచి హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది. అయితే టీవీలో, ఓటీటీ లో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా కాగా.. ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాలు హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను రీసెంట్గా రీ రిలీజ్ చేశారు.

ఇక రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించడం గమనార్హం. ఇక ఈ సినిమా కోసం యువత ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో భారీ కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో విశ్వక్సేన్ హీరోగా మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ సినిమా తర్వాత ఆయన మాస్ కా దాస్ గా ఎదిగిన విషయం తెలిసిందే. అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమా ద్వారా నటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇకపోతే రీ రిలీజ్ లో ఈ సినిమా రూ.1కోటి కి పైగా గ్రాస్ వసూలు చేసిందని.. బడా సినిమాల జాబితాలో ఈ నగరానికి ఏమైంది చిత్రం చోటు దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది.. మహేష్ బాబు ఒక్కడు, పోకిరి.. పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి .. రామ్ చరణ్ ఆరంజ్, అల్లు అర్జున్ దేశముదురు, ఎన్టీఆర్ సింహాద్రి వంటి రీ రిలీజ్ సినిమాల కలెక్షన్ల సరసన ఈ సినిమా చోటు దక్కించుకోవడం నిజంగా ఇదొక రికార్డు అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news