ఏపీ ఉపాధి కూలీలకు శుభవార్త… జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే కూలీల పెండింగ్ వేతనాలకు సంబంధించి అధికారులు స్పందించారు. 5 వారాలుగా చెల్లింపులు నిలిచిపోగా… త్వరలోనే ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాల్లో పెండింగ్ వేతనాలు జమ చేస్తామని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చెల్లింపులు ప్రారంభమయ్యాయని… త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ జమ అవుతాయన్నారు.
ఇది ఇలా ఉండగా,ఇవాళ 146 అంబులెన్స్‌లను ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్. ఇవాళ 146 అంబులెన్స్‌లను తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర జెండా ఊపి ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం దగ్గర కార్యక్రమం జరుగనుంది. కొత్త అంబులెన్స్‌ల కోసం రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది ఏపీ ప్రభుత్వం. 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56 కోట్లు…వెచ్చిస్తోంది.