బ్రో ఓకే పవన్ కళ్యాణ్ మిగతా సినిమాల సంగతేంటి.?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరంతేజ్ మల్టీ స్టార్లర్ మూవీగా వస్తున్న చిత్రం బ్రో.. సముద్రఖని దర్శకత్వంలో ఈనెల 28వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగానే పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ వేరే లెవెల్ అనేలా అనిపిస్తోంది. ఇక ఈ టీజర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆయన నటించాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్, OG , హరిహర వీరమల్లు తో పాటు మరికొన్ని చిత్రాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి మరి ఆ సినిమాల సంగతేంటి అన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఒకపక్క రాజకీయాలలో చాలా బిజీగా పాల్గొంటున్న ఈయన వారాహి యాత్రలో భాగంగా ప్రజలకు చేరువ అవ్వడానికి అక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

ఇక మరొకవైపు ఆయన ఒప్పుకున్న సినిమాల ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆ చిత్రాల దర్శకులు ,నిర్మాతలు ఈ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి ఇకనైనా పవన్ కళ్యాణ్ వీటిని త్వరగా కంప్లీట్ చేసి మళ్లీ రాజకీయాల్లోకి వెళ్తారా లేక రాజకీయాలనే ధ్యేయంగా పెట్టి వీటిని మధ్యలోనే ఆపేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news