గత కొంతకాలంగా రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్యన భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం లో ఉక్రెయిన్ అన్ని విధాలుగా నష్టపోయింది.. దేశంలోని జనాభా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వివిధ దేశాలకు వలస వెళ్లిపోయారు. ఇప్పటికీ శాంతించని రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఉక్రెయిన్ కు చెందిన 7 లక్షల మంది చిన్న పిల్లలను రష్యా లో గుర్తించామని రష్యా నేత గ్రిగోరి కరాసిన్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే లో భాగంగా ఈ విషయాన్నీ గుర్తించామని ఈయన తెలిపారు. ఈ పిల్లలు అంతా కూడా యుక్రెయిన్ లో బాంబు దాడికి గురైన ప్రాంతాల నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి వచ్చిన వారన్నారు .
అయితే ఇక్కడ ఎవ్వరికీ అర్ధం కానీ ప్రశ్న ఏమిటంటే.. పిల్లలు వారంతట వారే ఎలా వేరే దేశానికి వెళ్లిపోతారు ? యుక్రెయిన్ అనుమానిస్తున్నట్లుగా ఈ పిల్లలు అందరినీ రష్యా అక్రమంగా తీసుకు వెళ్లి ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు.