ప్రతికూల శక్తి పోవాలంటే.. ఇంట్లో ఈ చెట్లని పెంచండి..!

-

ప్రతి ఒక్కరు కూడా మంచే జరగాలని కోరుకుంటారు తప్ప చెడు జరగాలని ఎవరు కూడా అనుకోరు. చెడు జరగాలని ఎవరికీ ఉండదు. అయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దాని నుండి దూరంగా ఉంటే కచ్చితంగా అనుకునేవి జరుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. శుభ ఫలితాలను పొందొచ్చు. ఇంట్లో తులసి మొక్క ఉంటే చాలా మంచిది. ప్రతికూల శక్తి మొత్తం పోతుంది. మంచే జరుగుతుంది.

ఇంట్లో తులసి మొక్కని పెంచుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని తప్పక అనుసరించాలి. తులసి మొక్కకి రోజు నీళ్లు పోయడం, పూజ చేయడం, దీపారాధన చేయడం తులసి కోట దగ్గర శుభ్రంగా ఉంచడం వంటివి చేస్తే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలానే మనీ ప్లాంట్ ని ఇంట్లో పెడితే కూడా చాలా మంచి జరుగుతుంది డబ్బులు ఇంట్లోకి వస్తాయి ఆర్థిక పాత్రలు పోతాయి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

అలానే ఇంట్లో జమ్మి చెట్టు ఉంటే కూడా చాలా మేలు జరుగుతుంది. అంతా శుభమే జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట జమ్మి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని పెడితే సంపదకి లోటే ఉండదు. వ్యాపారులు వ్యాపారంలో రాణించగలరు. శనివారం జమ్మి చెట్టు కింద ఆవు నూనె తో దీపాన్ని వెలిగిస్తే శని దోషాలు పోతాయి.

అరటి చెట్టు ఇంట్లో ఉంటే చాలా చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు గురువారం నాడు అరటి చెట్టుని మినప్పప్పు బెల్లం తో పూజిస్తే ఎన్నో ఫలితాలని పొందొచ్చు. రావి చెట్టు కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది. పితృదేవతలు రావి చెట్టు పై నివసిస్తారని శాస్త్రం చెప్తోంది రావి చెట్టును పూజిస్తే పితృదేవతలకు అవి చేరుతాయని అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news