సత్యసాయి బాబా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం – ప్రధాని మోడి

-

పుట్టపర్తి సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రధాని మోడి చేతుల మీదుగా ప్రారంభం అయింది. వర్చువల్ గా మోడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.   ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ…పుట్టపర్తి లో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు చెప్పారు. సత్యసాయి బాబా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అన్నారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం ముందంజలో ఉందని చెప్పారు. సేవ అనే రెండు అక్షరాల్లో అనంత శక్తి ఉందని తెలిపారు. సత్యసాయి బాబా సేవలు ప్రపంచానికి స్ఫూర్తి అని.. గుజరాత్ భూకంపం సమయం లో బాధితులకు అండగా సత్యసాయి బాబా నిలిచి సేవలు అందించారన్నారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాగి జావ అందిస్తున్న సత్యసాయి ట్రస్టు కు అభినందనలు తెలిపారు. పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు మానవాళికి ఎంతో అవసరం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news