వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2023 : గెలుపే టార్గెట్ గా 2 కీలక మార్పులతో బరిలోకి జింబాబ్వే…

-

జింబాబ్వేలో జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే శ్రీలంక వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్ లకు అర్హత సాధించగా, మరొక్క స్థానం కోసం మూడు టీం ల మధ్యన హోరా హోరీ పోరు ఉండనుంది. అయితే ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో జింబాబ్వే కనుక గెలిస్తే వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్ లకు చేరబోయే రెండవ టీం గా మారనుంది. అందుకే జింబాబ్వే జట్టు రెండు కీలక మార్పులను చేసింది, గత మ్యాచ్ లో ఆడిన బ్రాడ్ ఇవాన్స్ మరియు ల్యూక్ జంగ్వే స్థానంలో ఇన్నోసెంట్ కియా మరియు చాటారా లను జట్టులోకి తీసుకుంది. గత మ్యాచ్ లో శ్రీలంక పై ఓడిపోవడంతో జింబాబ్వే కు కఠినంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇక ఎటువంటి సమీకరణలతో సంబంధం లేకుండా మెయిన్ మ్యాచ్ లకు వెళుతుంది. మరి ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది.

దీనితో స్కాట్లాండ్ బ్యాటింగ్ చేస్తోంది, కాగా ఇర్విన్ సేన తమ ప్రత్యర్థిని ఎంత స్కోర్ లోపు కట్టడి చేస్తుందో చూడాలి. ఈ మ్యాచ్ లో మరోసారి ఎర్విన్, విలియమ్స్ , రాజా లు రాణిస్తే గెలుపు ఈజీగానే దక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news