బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు గాయం అయింది, తాజాగా తెలుస్తున్న సమాచారం జవాన్ షూటింగ్ ను జరుపుకుంటున్న షారుఖ్ ఖాన్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పెద్ద గాయాలు ఏమీ తగలేకపోవడం అదృష్టంగా భావించాలి. కేవలం తన ముక్కుకు మాత్రమే గాయం కాగా.. అక్కడే ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకుని తాజాగా ఇండియాకు వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడట. అయితే మనకు ఆలస్యంగా వార్త వెలుగులోకి రావడంతో.. ఇప్పుడు అందరికీ తెలిసింది. కానీ షారుఖ్ టీం తెలుపుతున్న సమాచారం ప్రకారం గాయం నుండి పూర్తిగా కోలుకున్నాడట. అయితే మళ్ళీ షూటింగ్ లోకి ఎప్పుడు జాయిన్ అవుతాడని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కాగా జవాన్ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
ఇటీవల షారుఖ్ ఖాన్ నుండి వచ్చిన పఠాన్ మూవీ చాలా కాలం తర్వాత బాలీవుడ్ సినిమాకు ఊపిరి పోయడంతో మళ్ళీ షారుఖ్ ఖాన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. కాగా త్వరలోనే సినిమా టీజర్ ను మరియు విడుదల తేదీని ప్రకటించనున్నారు.