అందానికికొలమానంలేదు. చూడగానేనచ్చేఅందమేఅందం. ఆ అందమేఆనందం. కానీగ్రీకులుఅందానికి ఓ కొలమానంకనిపెట్టారు. స్కేలుపెట్టికొలిస్తేముక్కుఇంతుండాలి, నోరుఇంతుండాలి, నొసలింతుండాలిఅని. ఆశ్చర్యకరంగాదాదాపునూటికినూరుపాళ్లుఅవేకొలతలతో ఓ అమ్మాయిదొరికింది.
‘రవివర్మకేఅందనిఒకేఒకఅందానివో..’ అనిఅతివఅందాన్నిపొగిడాడోసినీకవి. అంతేమరి..!అందమంటే ఈ లెక్కలప్రకారంఉండాలిఅనిమనకు ఏ ప్రామాణికాలులేవు. చూడగానే, ఆహా..అనిపించేదేఅందం. అదిపువ్వైనా, పసినవ్వయినా, పడతిక్రీగంటిచూపయినా… ఆ అందమేఅనందం.
ప్రాచీనగ్రీకుశాస్త్రాలప్రకారం, ‘సౌందర్యసువర్ణనిష్పత్తి’ తోపోలిస్తే, ఇప్పుడున్నప్రపంచఅందగత్తెలలోఅమెరికన్ సూపర్ మోడల్ ‘ఇసబెల్లాఖైర్ హదిద్’. 23 ఏళ్ల ఈ ముద్దుగుమ్మగ్రీకులఅందంకొలతలప్రకారంఉండాల్సినబంగారునిష్పత్తితో 94.35శాతం సరిపోలింది. అద్భుతఅందంతోఅలరారేముఖాకృతిఎలాఉండాలోప్రాచీనగ్రీకులునిర్వచించారు. దానిప్రకారంబెల్లాముఖాకృతి, కళ్లు, ముక్కు, చెవులు, గడ్డం, బుగ్గలు, దవడలు… ఇలాఅన్నీదాదాపుప్రామాణికకొలతలకు94.35 శాతంఖచ్చితత్వంతోతేలాయి.
ప్రముఖపాప్సింగర్, బేయాన్స్ ద్వితీయస్థానంలోనిలిచింది. ఇంకాటాప్ టెన్లోనటి్ఆంబర్ హార్డ్, పాప్‌స్టార్ అరియానాగ్రాండ్, నటీమణులుస్కార్లెట్ జాన్సన్, కేటీపెర్రీ, మోడల్ కారాడెలెవింగన్ కూడాఉన్నారు.
లండన్, హార్లీవీధిలోనిఫేషియల్ కాస్మటిక్ సర్జన్ డా. జులియన్ డిసిల్వా, రకరకాలకంప్యూటర్ పద్ధతులనుఉపయోగించి, గ్రీకులునిర్వచించినఅందంకొలమానాలనుప్రామాణీకరించాడు. ‘బెల్లాహదిద్ ఈ పోటీలోస్పష్టమైనవిజేత. ముఖంలోనిఅన్నిభాగాలనుభౌతికసంపూర్ణతకోసంకొలవగా ఈ విషయంతెలిసింది’ అనిడిసిల్వాతెలిపారు. ప్రామాణికకొలతకుదాదాపుదగ్గరగావచ్చిందిఅమెగడ్డం. అది 99.7శాతం సరిపోలింది.
నిజానికిసువర్ణనిష్పత్తిఅనేదిఅందాన్నిప్రామాణీకరించడానికిగ్రీకులుఅవలంబించినఒకగణితసూత్రం. చిత్రకారులు, శిల్పులుగొప్పసౌందర్యవతిబొమ్మనుచిత్రించడానికిలేదాచెక్కడానికి ఈ గణితసూత్రాన్నివాడేవారు. అప్పటినుండీశాస్త్రవేత్తలుకూడాదాన్నేఅనుసరించారు. ఒకరిముఖంయొక్కపొడవువెడల్పులనుకొలిచిబాగిస్తారు. గోల్డెన్ రేషియోప్రకారంప్రామాణికఫలితందాదాపు 1.6 ఉంటుంది.
పాప్‌సింగర్ బేయాన్స్ (రెండోస్థానం)
నుదురు ప్రారంభం నుండి కళ్ల మధ్యవరకు, కళ్ల మధ్య నుండి ముక్కుకొన వరకు, ముక్కుకొన నుండి గడ్డం చివరి వరకు కొలతలు తీసుకుంటారు. ఇవన్నీ సమానంగా ఉంటే వారిది అద్భుతమైన అందంగా పరిగణిస్తారు. ‘సౌందర్యరాశి’ అనిస్టాంపుగుద్దాలంటే, ముక్కు చెవుల పొడవులు సమానంగా ఉండాలి. ఒక కంటి వెడల్పు, రెండు కళ్ల మధ్య దూరంతో సమానంగా ఉండాలి. ఇదీలెక్క.