బిగ్‌బాస్‌లో కుట్ర జ‌రుగుతోందా…?

-

తెలుగు బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ ఫైనల్ స్టేజ్ లో వేడెక్కింది.  మొత్తం 17 మందితో ప్రారంభమైన షో…ప్రస్తుతం ఆరుగురు సభ్యులతో క్లైమాక్సుకు చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి 11 మంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నారు. మధ్యలో 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన వారు కూడా రెండు వారాలకు మించి హౌస్లో ఉండలేదు. ఇక బయటకు వెళ్లిన వారిలో  మాత్రం అలీ రీఎంట్రీ ఇచ్చాడు.  ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఉండగా, వీరిలో చివరి వారం ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకుని బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడతారు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ టాస్క్‌లు ముందు నుంచి కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హౌస్ నుంచి బయటకు వచ్చిన హిమజ, మహేష్ లాంటి వాళ్లు సైతం ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించారు. బిగ్ బాస్ దర్శకులు శ్రీముఖి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గతంలో సైతం బిగ్ బాస్ దర్శకుల్లో ఒకరు తనకు తెలుసునని చెప్పినట్టు హిమజ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ 3 లో ప్రస్తుతం ఎక్కువమందికి ఫేవరెట్ ఎవరంటే ఎక్కువగా శ్రీముఖి పేరు వినిపిస్తోంది.

ఖ‌చ్చితంగా ఆమె ఫైనల్ కి వస్తుంది అన్నట్టుగానే గేమ్ ప్లాన్ జరుగుతున్నట్టుగా షో చూస్తున్న వారికి స్పష్టంగా అర్థం అవుతోంది. బిగ్ బాస్ షో చివరి దశకు వచ్చేసరికి బాబా భాస్కర్, శ్రీముఖికు గట్టిపోటీ దారుడిగా మారిపోయాడు.  శ్రీముఖితో కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా, అవసరం అయితే ఆ సమయానికి బాబా ఏదైనా చేస్తారనే అభిప్రాయం బిగ్ బాస్ కి వచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే శ్రీముఖి కోసం బిగ్ బాస్ బాబాని నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బాబాకు బయట అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ఓట్ల శాతంలో ప్రస్తుతం భాస్కర్, శ్రీముఖిలకు పెద్దగా తేడా లేకపోవడంతో, బిగ్ బాస్ శ్రీముఖి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు వరుణ్ సందేశ్ సైతం శ్రీముఖి గట్టి పోటీ ఉన్న చివర్లో  వితికాని సేఫ్ చేయడం కోసం చేసిన ప్రయత్నాలు వల్ల  ఎంతో చాలా మంది ఓటర్లను దూరం చేసుకున్నాడు.  ఇప్పుడు వీరంతా భాస్కర్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ బయటకు వస్తున్న పుకార్ల ప్రకారం బిగ్ బాస్ నుంచి బాబా భాస్కర్ ను బయటకు పంపించే టాస్క్ లో బిగ్ బాస్ టీం ఉందని తెలుస్తోంది.

అదే నిజమైతే వచ్చే వారం బాబాను బయటకు పంపించేందుకు భారీ ప్రణాళికే ఈ రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా బాబా భాస్కర్ ని మోసగాడిగా.. ముసుగు వేసుకున్న వాడిగా నిలబెట్టే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news