నేడు ధోని బర్త్ డే.. రైనా ఎమోషనల్ పోస్ట్

-

మాజీ ఇండియా కెప్టెన్ మరియు ప్రస్తుతం ఐపిఎల్ టీమ్ చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటతో మరియు తనదైన మంచితనంతో ప్రపంచం నలువైపులా కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్నాడు. ఈయన జీవిత చరిత్రను కూడా MS ధోనీ ది అంటోల్డ్ స్టోరీ పేరుతో సినిమాగా చిత్రీకరించారు.

అయితే.. ఇవాళ మహేంద్రసింగ్ ధోనీ బర్త్‌ డే . ఈ తరుణంలోనే.. చాలా ప్రముఖులు మహేంద్రసింగ్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే… మహేంద్రసింగ్ ధోనీకి సురేష్ రైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘మా పెద్దన్న దోనికి జన్మదిన శుభాకాంక్షలు. పిచ్ దగ్గర నుంచి మన డ్రీమ్స్ వరకు అన్ని పంచుకున్నాం. మన బంధం శాశ్వతం. స్నేహితుడిగా, నాయకుడిగా మీ బలం నాకు దారి చూపింది. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా. మీ మ్యాజిక్ కంటిన్యూ చేస్తూనే ఉండండి’ అని ఓ వీడియో షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news