కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం – రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

-

కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీ కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరి. నేడు ఖమ్మంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు అడ్డంకులు సృష్టించినా సక్సెస్ కావడంతో బిఆర్ఎస్ నేతలలో భయం పట్టుకుందన్నారు. ఖమ్మంలో జరిగిన జనగర్జన సభను చూసి బీఆర్ఎస్, బిజెపి పార్టీలు బెదిరిపోయాయని అన్నారు. అయినా సభ దెబ్బకి కారు నాలుగు టైర్లకు పంచర్ అయిందని, బిజెపిని కర్ణాటకలో తరిమితే తెలంగాణలో లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.

అందుకే కిషన్ రెడ్డిని రంగంలోకి దింపారని అన్నారు. బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటారనే కిషన్ రెడ్డిని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో కేంద్రం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేణుక చౌదరి. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒకటేనని.. తెలంగాణలో బిజెపి అడ్రస్ లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇక కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధం కాబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news