BREAKING : ఎమ్మెల్యే రాజయ్యకు ప్రగతి భవన్‌ నుంచి పిలుపు

-

 

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య కు బిగ్‌ షాక్‌ తగిలింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య కు BRS అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కొద్ది రోజులగా సొంత పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు రాజయ్య. ఈ తరుణంలోనే.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య కు BRS అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఇక మరికాసేపట్లో కేటీఆర్ తో రాజయ్య భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది.

కాగా, ఎమ్మెల్యే రాజయ్య కు వార్నింగ్‌ ఇచ్చారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఎమ్మెల్యే రాజయ్య తన తల్లిని అవమానించిన తీరుకు భావోద్వేగానికి గురయ్యారు కడియం శ్రీహరి. రాజకీయాల కోసం 93 ఏళ్ళ తన తల్లి గురించి కూడా అంత నీచంగా మాట్లాడటం అవసరమా అని ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. నా తల్లి బీసీ, తండ్రి ఎస్సీ. తండ్రి కులమే పిల్లలకు వస్తుందన్నారు.రాజకీయాలను రాజకీయంగా చేద్దాం, కుటుంబాలను ఇందులోకి లాగొద్దని కోరారు కడియం శ్రీహరి. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.

Read more RELATED
Recommended to you

Latest news