మహిళ బర్త్ డే కు గిఫ్ట్ గా టమాటాలు .. వాటి ధరలాగే ఆకాశమంత ఎదగాలంటూ విషెస్

-

గత కొద్ది రోజులుగా టమాటాల ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు రూ.10 ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.250 దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 మధ్య ఉంది. అయితే సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ఈ టమాట ధరలపై సోషల్ మీడియాలో తెగ మీమ్స్ వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో పుట్టిన రోజు జరుపుకున్న ఓ మహిళకు కానుకగా టమాటాలు అందించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో వీటి ధర రూ.140 పలుకుతుండగా.. పుట్టినరోజు వేడుక జరుపుకొన్న ఓ మహిళకు ఆమె బంధువులు 4 కిలోలకు పైగా టమాటాలు కానుకగా ఇచ్చి ఆకాశమంత ఎదగాలని దీవించారు. కల్యాణ్‌ పట్టణంలోని కొచాడి ప్రాంతంలో నివసిస్తున్న సోనాల్‌ బోర్సే ఆదివారం తనకు పుట్టినరోజు కానుకగా వచ్చిన టమాటాలను చుట్టూ పెట్టుకొని కేక్‌ కట్‌ చేశారు. తన సోదరుడు, బంధువులు ఇచ్చిన ఈ కానుక ఎంతో సంతోషపరచిందని ఆమె చెప్పారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news