ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు పురంధేశ్వరి. ఈ సందర్భంగా పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు సోము వీర్రాజు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ… బీజేపీ అవినీతికి దూరంగా ఉండే పార్టీ.. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నా మీద నమ్మకం విశ్వాసంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించినందుకు ధన్యవాదాలు అన్నారు.
శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని… గత అధ్యక్షుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ వారి మార్గదర్శకత్వంలో పని చేస్తానని వివరించారు. ఓట్లతో నిమిత్తం లేకుండా ఏపీకి బీజేపీ పూర్తి సహకారం అందిస్తూనే ఉందని.. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ. 6 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయని.. రైతులకు రూ. 12500 ఇస్తామన్న జగన్ హామీ ఏమైంది..? అని నిలదీశారు. సబ్ కే సాత్.. సబ్ కా వికాస్ నినాదంతో బీజేపీ ఏపీకి సహకారం అందిస్తోందని వివరించారు.