రజాకర్ మూవీ పోస్టర్ లాంచ్..పాత బస్తీ ఫైల్స్‌ తీస్తామని బండి సంజయ్‌ ప్రకటన !

-

రజాకర్ మూవీ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జలవిహార్ లో పోస్టర్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కాశ్మీర్ ఫైల్స్ చూస్తున్న సమయంలో పాతబస్తీ ఫైల్స్ తీద్దామని చెప్పానని.. ఫస్ట్ రజాకర్ ల ఫైల్స్ తీద్దామని గూడూరు నారాయణ రెడ్డి చెప్పాడన్నారు.

చెప్పింది చేసి చూపించిండు… అన్నకి గుండె దైర్యం ఎక్కువే అని తెలిపారు. నిజమైన చరిత్రని చూపించాలన్న భయపడే పరిస్థితి వచ్చిందని… ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు అని వివరించారు. ఎవడికి తెలంగాణ చరిత్ర తెలీదని.. ఇప్పుడున్న ఆ పార్టీ అప్పుడు పుట్టలేదు కూడా అంటూ తెలిపారు. తెలంగాణ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి విద్యాసాగర్ రావు ఒక్కడేనని.. తెలంగాణకు స్వతంత్రం తేడానికి ఎంతో ఫైట్ చేసాడని తెలిపారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news