విజయ్ దేవరకొండ “ఖుషి” మూవీ షూటింగ్ పూర్తి… !

-

విజయ్ దేవరకొండ మరియు సమంతలు జంటగా నటించిన అప్ కింగ్ సెన్సషనల్ లవ్ స్టోరీ ఖుషి తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించడంతో ఆ పనుల్లో చిత్ర బృందం చాలా బిజీ గా ఉంది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకు వెళ్లాయి అని చెప్పాలి. ఈ రెండు పాటలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్లాయి. కాగా ఇటీవల విడుదలైన ఆరాధ్య సాంగ్ ద్వారా ఈ సినిమాలో విజయ్ మరియు సమంతల మధ్యన కెమిస్ట్రీ ఎలా ఉండనుంది అని చూపించారు. కాగా డైరెక్టర్ శివ నిర్వాణకు ప్రేమకథలను చక్కగా తెరకెక్కించడంలో ప్రత్యేక పంథా ఉంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ బాషలలో విడుదల కానుంది. మరి విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్ ను అందుకుంటాడా ?

Read more RELATED
Recommended to you

Latest news