తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడతానని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పదవుల కోసం ఏనాడు పాకులాడలేదని, ఎవరి కాళ్లు పట్టుకోలేదని చెప్పారు. ఉచిత విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని తాము చెబుతుంటే బిఆర్ఎస్ నేతలు ఆ సబ్జెక్టుకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడే రైతులుకు 9 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని అన్నారు. ఉచిత కరెంట్ రెఫరండానికి కాంగ్రెస్ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఏ సబ్ స్టేషన్ లోన్ అయితే 24 గంటల కరెంటును అందిస్తున్నారో.. ఆ సబ్ స్టేషన్ కింద ఉన్న గ్రామాల్లో తాము ఓట్లు అడగబోమని సవాల్ విసిరారు. ఒకవేళ 24 గంటల విద్యుత్ అందించకుంటే ఆయా గ్రామాలలో బిఆర్ఎస్ నేతలు ఓట్లు అడగకుండా ఉంటారా..? అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.