పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చూపించేసిన డస్కీ బ్యూటీ..!

-

డస్కీ బ్యూటీ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు గోవా బ్యూటీ ఇలియానా.. తన అందంతో , నటనతో కుర్ర కారు హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పోకిరి సినిమాలో తన అందంతో రెండు తెలుగు రాష్ట్రాల యువతను కట్టిపడేసింది. ఎంతోమంది స్టార్ హీరోలతో సందడి చేసిన ఈమె తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ కూడా అడపాదడపా అవకాశాలు అందుకుంటూ మళ్లీ తెలుగులోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది..

ఇదిలా ఉండగా మరొక పక్క పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రతినెల తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఆమె గర్భానికి కారణం ఎవరు అన్న విషయాలపై ఎప్పటికప్పుడు నెటిజన్ లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా గత కొద్ది రోజులుగా ఇలియానా.. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ప్రేమలో ఉంది అంటూ రకరకాల కామెంట్లు వినిపించాయి. అంతేకాదు ఈమె గర్భానికి అతడే కారణం అంటూ కామెంట్లు కూడా వచ్చాయి.

కానీ దీనిపై ఏమాత్రం స్పందించని ఇలియానా.. తాజాగా ఒక పోస్ట్ తో ఆ వ్యక్తి ఎవరో చెప్పేసింది. తాజాగా ఒక పోస్టులో ఒక వ్యక్తితో ఆమె చాలా సన్నిహితంగా ఉండి “డేట్ నైట్ “అంటూ రాసుకుంది. అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి సెబాస్టియన్ కాదు. అతడు ముంబై కి చెందిన వ్యాపారవేత్త అని.. అతడే ఇలియానా గర్భానికి కారణం అంటూ ఇప్పుడు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇతడే ఆమె గర్భానికి కారణమా? లేక మరెవరైనా ఉన్నారా? అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news