BRS, కాంగ్రెస్, MIM మూడు పార్టీలు కలవబోతున్నాయని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే హంగ్ అసెంబ్లీ రావచ్చునన్న కొన్ని BRS సర్వే ఊహాగానాలు తెలుస్తున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలైనంక తెలంగాణల ఈ మూడు సయామీ (బీఆరెస్, కాంగ్రెస్, ఎంఐఎం) పార్టీలు కలుస్తాయన్నది… రేపటి పార్లమెంట్ సమావేశాలలోనే ప్రజలకు తెలుస్తాది కావచ్చు అంటూ పోస్ట్ చేశారు విజయశాంతి.
జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణల సైద్ధాంతిక ప్రాతిపదికపై బహుశా రానున్న సమయం ఇదన్నారు. రేపటి పార్లమెంట్ సమావేశాలలో బీజేపీ వ్యతిరేక ధోరణి కలిగిన బీఆరెస్, కాంగ్రెస్ ఎంఐఎం (UCC అంశంలో) ఒక వైపు… జాతీయవాదం ఒకవైపు అన్న సందర్భం ఉత్పన్నం కాక తప్పని సమయంలో , అర్థం చేసుకోగలిగిన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం నేడు ఉన్నదని వెల్లడించారు విజయశాంతి. ఎంఐఎం ఎన్నడైనా బీఆరెస్‌కు మద్దతిస్తాది. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు గెలిస్తే… ఎట్లయినా బీఆరెస్‌కే వెల్తారు. అంతే కదా నడుస్తున్న విధానం అన్నారు విజయశాంతి.