అంజలీదేవి పెళ్లి వెనుక ఇంత తతంగం జరిగిందా..?

-

అలనాటి అందాల తార స్వర్గీయ నటీమణి అంజలీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అనార్కలి అనే సినిమా ద్వారా ఒక వర్గం ప్రేక్షకులను తన అందచందాలతో మంత్రముగ్ధుల్ని చేసిన ఈమె ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు తోనే ప్రేమ కథ చిత్రాలలో నటించి మంచి ప్రావీణ్యం పొందింది. ఈ జంటకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ కూడా ఉండేది. చాలా వరకు సినిమాలలో కలిసి నటించిన జంటలు ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎక్కువే ఉన్నాయి అని ఈ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు అంజలి ఇద్దరు పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు.

అంతేకాదు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని కొన్ని రూమర్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అయితే అందులో నిజం లేకపోయింది. అంజలీదేవి ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ ను వివాహం చేసుకుంది. అయితే ఈ విషయాలపై గుమ్మడి తన పుస్తకంలో కొన్ని వివరాలను కూడా వెల్లడించారు. అంజలీదేవి ప్రేమ వివాహం చేసుకోలేదు కానీ ఆదినారాయణ మాత్రం అంజలి కుటుంబానికి దూరం బంధువు.. ఎప్పటికప్పుడు అంజలికి సంబంధించిన క్షేమ సమాచారాలను ఆదినారాయణ ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకునేవారు. తద్వారా వీరి కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో వీరికి పెళ్లి చేస్తే బాగుంటుందని భావించిన కుటుంబ సభ్యులు వీరికి వివాహం జరిపించారు.

పెళ్లి గురించి ఒక రోజు మీడియా ముందు స్వయంగా కొన్ని విషయాలను వెల్లడించింది అంజలీదేవి.. మాది ప్రేమ వివాహం కాదు పెద్దలు కుదిర్చిన వివాహం.. మా ఇంటికి ఆదినారాయణ రావు గారు తరచూ వచ్చేవారు. అతడు కూడా సినిమాలలో ఉండడంతో నా జీవితం బాగుంటుందని నా తల్లిదండ్రుల భావించి మాకు వివాహం చేశారు. ఇక వారి ఆశీస్సుల వల్లే మేము సంతోషంగా ఉన్నామంటే చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే అంజలీదేవి తన పెళ్లి గురించి చెప్పిన తర్వాత వీరి పెళ్లి వెనుక ఇంత తతంగం జరిగిందా అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news