ఆన్‌లైన్‌లో రూ. 90 వేల విలువైన లెన్స్‌ ఆర్డర్‌ చేస్తే విత్తనాలు పంపిన అమెజాన్‌

-

వంటగదిలో కావాల్సిన సరకుల నుంచి బట్టలు, మన అవసరాలకు ఏది తీసుకోవాలన్నా జనాలు ఆన్‌లైన్‌కు బాగా అలవాటు పడిపోయారు. షాప్‌కు పోయి కొన్నా అంతే అవుతుంది. అక్కడ రిటర్న్‌ చేసే ఆప్షన్‌ ఉండదు. అదే ఆన్‌లైన్‌లో అయితే నాలుగు రోజులు వాడి నచ్చకపోతే మళ్లీ పంపించేయొచ్చు. ఇలా అనుకోనే ఓ కష్టమర్‌ రూ. 90 వేలు విలువైన లెన్స్‌ను అమెజాన్‌లో ఆర్డర్‌ పెట్టాడు. లెన్స్‌ వస్తే ఇక్కడ వార్త ఎందుకు అయ్యేది.. పాపం అతనికి లెన్స్‌ బదులు చియాసీడ్స్‌ డెలివరీ అయ్యాయి. ఇంతకుముందు ఫోన్లు ఆర్డర్‌ పెడితే సోప్స్‌ వచ్చేవి అనేవాళ్లు. సరిగ్గా అలానే జరిగింది ఇక్కడ.

ఆన్‌లైన్‌ ఆర్డర్‌లతో ఎంత వెసులుబాటు ఉంటుందో అంత టెన్షన్‌ కూడా ఉంటుంది. మనం ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే మనకు వచ్చేది ఒకటి. చాలా మంది ఇప్పటికే ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్ చేసే ఉంటారు. ఓ నెటిజన్‌కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ట్విటర్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టాడు.

ఈ మధ్యే రూ.90 వేలు విలువ చేసే కెమెరా లెన్స్‌లు ఆర్డర్ పెట్టాడు. చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూశాడు. ఇంటికి డెలివరీ రాగానే ఓపెన్ చేశాడు. ఆర్డర్‌ ఓపెన్‌ చేసిన తనకు దిమ్మతిరిగిపోయే షాక్‌ ఇచ్చింది అమెజాన్. కెమెరా లెన్స్‌కి బదులు ఆ పార్సిల్‌లో చియా సీడ్స్ ప్యాకెట్ కనిపించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…కెమెరా లెన్స్ బ్యాగ్, బాక్స్‌ కరెక్ట్‌గానే ఉన్నాయి. అందులో లెన్స్‌కి బదులు చియా సీడ్స్ ప్యాకెట్‌ని ఎందుకు పెట్టారు. ఇది చూసిన వెంటనే తీవ్ర అసహనానికి గురైన ఆ కస్టమర్ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.

“అమెజాన్‌లో రూ.90వేల విలువైన కెమెరా లెన్స్‌ ఆర్డర్ చేశాను. నాకు వచ్చింది మాత్రం చియా సీడ్స్ ప్యాకెట్. లెన్స్‌ బ్యాగ్‌, బాక్స్‌లో ఈ ప్యాకెట్ పెట్టి పంపించారు. ఇదో పెద్ద స్కామ్. లెన్స్ బాక్స్‌ ఓపెన్ చేసి ఉంది. వీలైనంత త్వరగా నా సమస్యని సాల్వ్ చేయండి” అని ఆ బాధితుడు రాసుకొచ్చాడు.

అమెజాన్ తన కంప్లెయింట్‌ని రిజిస్టర్ చేసుకుందని, త్వరలోనే ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేస్తామని తెలిపిందట. ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు తమకు కూడా గతంలో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని కామెంట్స్ పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో మరీ అంత విలువైన వస్తువులు కొనకపోవడమే బెటర్‌ అని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే జరభద్రం ఉండాలే.

Read more RELATED
Recommended to you

Latest news