యాంకర్ రవి సంచలన పోస్ట్… ఆ హౌలే గాళ్లు ఎవ‌రు..?

-

బుల్లితెరపై యాంకర్‌గా తనదైన శైలిలో ఆకట్టుకుంటోన్న యాంకర్ రవి కామెడీ షోలతో అదరగొడుతుంటాడు. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ర‌విపై వార్త‌లు వ‌స్తూనే ఉంటాయి. ఇక చాలా రోజుల నుంచి ర‌వి సైలెంట్‌గా త‌న ప‌ని తాను చూసుకుంటూ వ‌స్తున్నాడు. అయితే ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌లో.. నా లైఫ్ ఫిలాసఫీ చాలా సింపుల్.. లో లివింగ్.. హై థింకింగ్.. కష్టపడాలే.. పేరు తెచ్చుకోవాలే.. డబ్బులు సంపాదించాలే.. ఫైనల్‌గా హౌలేగాళ్లను దూరం పెట్టాలే అంటూ ఓ పోస్ట్ చేశాడు.

దీనికి స్పందించిన నెటిజన్లు హౌలేగాళ్లంటే ఎవరని అడిగారు. ఇక ఇది ప‌క్క‌న పెడితే.. శ్రీముఖి బిగ్ బాస్ షోలో తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి చెప్పింది. శ్రీ‌ముఖి అత‌డు తనను మోసం చేసాడని కూడా చెప్పింది. దీంతో ఆ మోసం చేసింది యాంకర్ రవి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్ప‌డు ర‌వి ఈ పోస్ట్ పెట్ట‌డంతో.. గుమ్మడికాయల దొంగ ఎవరు అన్నట్లున్నాయంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. రవి, శ్రీముఖికి మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతున్నట్లు కనిపిస్తోంద‌ని మ‌రికొంద‌రు అనుమానాలు వ‌క్తం చేస్తున్నారు. ఏదేమైన ప్ర‌స్తుతం ర‌వి పెట్టిన ఈ పోస్ట్ తెగ‌ వైర‌ల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news