టీటీడీలో నెయ్యి కల్తీ చంద్రబాబు హయాంలోనే జరిగింది : జగన్

-

చంద్రబాబు ప్రతీ అడుగులో డైవెర్షనే అని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  ప్రతీ అడుగులోనూ డైవెర్షన్ కనిపిస్తోంది. చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు. ఇవాళ డోర్ డెలివరీ పెన్షన్ లేదు.. డోర్ డెలివరీ రేషన్ లేదు.  ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులను పెడుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. చంద్రబాబు మొత్తం డైవెర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. 

దేవుడిని కూడా రాజకీయాల్లో వాడుకునే దుర్మార్గుడు చంద్రబాబు.  ఇంత అన్యాయస్తుడు ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. జులై 04న చంద్రబాబు విజయం సాధించారు. జులై 23న రిపోర్టు వచ్చింది. ఆ సమయంలో సీఎంగా చంద్రబాబే ఉన్నారు.  అసలు జులై 23 నుంచి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వాస్తవానికి ప్రతీ ట్యాంకు టెస్ట్ లను మూడు సార్లు టెస్ట్ చేస్తారు. జులై 23న ఇచ్చిన రిపోర్టుని ఇప్పుడు బయటికి తీసి ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ఆడుతున్నారు. ఒక సీఎం అబద్దాలు ఆడటం ధర్మమేనా..? ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news