టమాటాలు అమ్మి ఒక్క నెలలో 3 కోట్లు సంపాదించిన రైతు !

-

రోజు రోజుకు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కాయగూరలు కొందామని మార్కెట్​కు వెళ్తున్న సామాన్యులు ధరలు చూసి తట్టుకోలేక ఖాళీ సంచులతో ఇంటికి తిరుగు పయనమవుతున్నారు. కూరల్లో అత్యంత ముఖ్యమైన టమాట, మిర్చిల ధరలు అన్నింటికంటే ఎక్కువగా ఉండటంతో బెంబేలెత్తిపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే టమాటాలు అమ్మి ఒక్క నెలలో 3 కోట్లు సంపాదించాడు ఓ రైతు. మహారాష్ట్ర – పూణేకి చెందిన ఈశ్వర్ గాయ్‌కర్ అనే రైతు 12 ఎకరాల్లో మూడేళ్లుగా టమాటాలు పండించి నష్టాలే తప్ప పెద్దగా లాభాలు ఎప్పుడూ చూడలేదు. ఈ సంవత్సరం టమాటా ధర భారీగా పెరగటంతో గత నెల రోజుల్లో ఏకంగా 3,60,000 కిలోల టమాటాలు అమ్మి 3 కోట్ల రూపాయలు ఆర్జించాడు. మరో 80,000 కిలోల పంటతో 50 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాడు. 40 లక్షలు పెట్టుబడి ఖర్చులు పోగా ఈశ్వర్ భారీ లాభాలు చవిచూశాడు.

Read more RELATED
Recommended to you

Latest news