Viral Video : హీరోలా స్టంట్‌ చేద్దామని.. స్కూల్‌ బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థి

-

సినిమాలు చూసి హీరోలాగా స్టంట్ చేయాలనుకున్నాడు మూడో తరగతి చదువుతున్న విద్యార్థి. దీనికి స్కూల్ బిల్డింగ్ ను ఎంచుకున్నాడు. మొదటి అంతస్తుపై నుంచి హీరోలా కిందకు జంప్ చేయాలని ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది.

డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ స్కూల్‌లో చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడికి హీరో హృతిక్ రోషన్ అంటే ఇష్టం. క్రిష్ మూవీలో ఆ హిరో చేసినట్లుగా స్టంట్‌ చేయాలని భావించి.. మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి రెండు కాళ్లపై నిలబడతానని తోటి విద్యార్థులతో చెప్పాడు. బుధవారం రోజున క్లాస్ నుంచి బయటకు వచ్చి స్కూల్ బిల్డింగ్ లోని మొదటి అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకాడు. దూకిన తర్వాత రెండు కాళ్లపై నిల్చోలేక నేలపై పడటంతో బాలుడి ముక్కు, కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన స్కూల్‌ బిల్డింగ్‌ ఆవరణలో ఉన్న సీసీటీవీలో రికార్డవ్వడంతో ప్రస్తుతతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news