టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుని ఇప్పుడు దేశం నలుమూలలా అన్ని భాషలలో సినిమాలను చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది కేరళ కుట్టి సమంత. సినిమా కెరీర్ లో ఎన్నో అవార్డులను, రికార్డులను అధిగమించిన సమంత తాజాగా మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రతి నెల స్టార్స్ ఇండియా అనే సంస్థ నిర్వహించే సర్వే లో దేశంలోనే మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఎవరు అనే కాంటెస్ట్ లో ఎందరో ఉండగా.. సమంతను ప్రజలు తమ అభిమానంతో ఓట్లు వేసి మొదటి స్థానంలో నిలిపారు. జూన్ నెలకు గాను మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్ గా సమంత ఎంపిక అయింది.. ఈ ఫలితాన్ని స్టార్స్ ఇండియా సంస్థ కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ రికార్డ్ గురించి తెలిసిన ఆమె అభిమానులు సంతోషంగా ఉన్నారు.
కాగా ఈమె ప్రస్తుతం బాలీవుడ్ , హాలీవుడ్ అంటూ నటిస్తూ చాలా బిజీగా మారిపోయింది. ఇక ఈమె నాగచైతన్య తో విడాకుల అనంతరం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.