తెలంగాణలో గంజాయి అక్రమ రవాణా యదేచ్చగా కొనసాగుతూనే ఉంది. అక్రమ రవాణాలను అడ్డుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినప్పటికీ గంజాయి స్మగ్లర్లు తమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. రైళ్ల ద్వారా గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతూనే ఉంది.
రైళ్లలో మత్తు పదార్థాలు, గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చరించినప్పటికీ గంజాయిస్ స్మగ్లర్లు తమ దందాలు కొనసాగిస్తూనే ఉన్నారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 22 కిలోల గంజాయిని ఆర్పిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 22 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రైల్లో అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగులను తనిఖీ చేయగా ఈ వ్యవహారం బయట పడ్డట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.