HARMANPREETH KOUR : అంపైర్ మీద కోపం .. వికెట్ల మీద చూపించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ !

-

ఈ రోజు బంగ్లాదేశ్ మరియు ఇండియా మహిళల మధ్యన మూడవ వన్ డే జరుగుతోంది. ఇంతకు ముందు రెండు మ్యాచ్ లలో చెరొకటి గెలవడంతో ఇది సిరీస్ డిసైడర్ కానుంది. ఇక దాదాపుగా ఇండియా గెలుపు ఖాయం అయినట్లే.. కాగా ఛేదనలో ఇండియా కెప్టెన్ ప్రవర్తించిన తీరు పట్ల అభిమానులు మరియు మ్యాచ్ చూస్తున్న వారు కామెంట్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ 34వ ఓవర్ లో నాహీద్ అక్తర్ బౌలింగ్ లో స్వీప్ షాట్ ఆడాలని చూసిన హర్మన్, బంతి మిస్ అయ్యి తన ఫ్యాడ్ లను తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది.. కానీ దీనికి కీపర్ మరియు బౌలర్ ఎల్ బీ డబ్ల్యు గా అవుట్ ఇవ్వాలంటూ అప్పీల్ చేశారు. ఇక అంపైర్ కూడా వారి అప్పీల్ కు ఓకే చెప్పి హర్మన్ ను అవుట్ గా ప్రకటించాడు. రివ్యూలు లేకపోవడంతో ఆమె వెనుతిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో హర్మన్ అంపైర్ పైన తీవ్ర ఆవేశంతో బ్యాట్ తో వికెట్లను కొట్టింది.

ప్రస్తుతం ఈ ఘటనపైన హర్మన్ ఖచ్చితంగా బీసీసీఐ కు మరియు ఐసీసీ కు తగిన సమాధానము చెప్పాల్సి ఉంటుంది. ఇక అభిమానులు కూడా అంతా ఆవేశం ఎందుకమ్మా ? అదేదో ఆట మీద చూపించు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news