నా తల్లిదండ్రులను తిడితే.. నేను కవితను తిట్టకుండా ఊరుకోవాలా?: ఎంపీ అర్వింద్

-

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే నిరుపేద ప్రజలకు ఎన్నటికీ రెండు పడక గదుల ఇళ్లు రావని బీజేపీ ఎంపీ అర్వింద్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ పేదల కోసం కడుతున్న ఇళ్లు.. గృహప్రవేశం కంటే ముందే కూలిపోతున్నాయని ఆరోపించారు. డబుల్ బెడ్​రూం ఇళ్ల పరిశీలినకు తాము వెళ్తామంటే.. ఎక్కడ వారి తప్పులు బయటపెడతామేమోనని భయపడి తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. డబుల్ బెడ్​ రూం ఇళ్ల విషయంలో తెలంగాణ సర్కార్​పై బీజేపీ చేపడుతున్న పోరాటంలో భాగంగా ఇవాళ నిజామాబాద్​లో నిర్వహించిన ధర్నాలో అర్వింద్ పాల్గొన్నారు.

మరోవైపు నియోజకవర్గంలో 3వేల ఇళ్లకు ఆర్థిక సాయం ఇస్తానని సీఎం కేసీఆర్ మాటిచ్చారని.. బడ్జెట్‌లో నిధులు అవాస్ యోజనకు కేటాయిస్తున్నట్లు అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. బడ్జెట్‌లోని నిధుల్లో రూ.10వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కవితకు నిధులు ఇస్తే లిక్కర్ స్కాంలో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు. తన తల్లిదండ్రులను తిడితే.. తాను కవితను తిట్టకుండా ఊరుకోవాలా అని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news