ఆస్ట్రేలియా మరియు ఐర్లాండ్ మహిళల మధ్యన మూడు వన్ డే ల సిరీస్ లో భాగంగా మొదటి వన్ డే బంతి కూడా పడకుండానే వర్షార్పణం అయిపోయింది. కాగా ఈ రోజు రెండవ వన్ డే లో టాస్ గెలిచిన ఐర్లాండ్ మహిళలు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా కు ప్లస్ అయింది అని చెప్పాలి. మొదటగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడంతో పసికూనపై విశ్వ విజేత తమ ప్రతాపాన్ని చూపించింది, నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఇందులో ఆల్ రౌండర్ ఎలీసా పెర్రీ తన ఫామ్ ను కొనసాగిస్తూ 91 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆమె తర్వాత మరో ఆల్ రౌండర్ గార్డనర్ సైతం 65 అర్ద సెంచరీ చేసింది. ఇక చివర్లో సథర్లాండ్ మరియు వేర్ హాం లు హిట్టింగ్ చేయడంతో ఆస్ట్రేలియా 321 పరుగులు చేసింది.
ఐర్లాండ్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది… మరి ఈ స్కోర్ ను ఐర్లాండ్ ఛేదిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే.