కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించారు ప్రముఖులు. ఆనాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ సైనికుల సేవలను కొనియాడారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన కార్గిల్ యుద్ధం వీరులకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కార్గిల్ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
నాటి యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. 1999 మే 3 నుంచి జూలై 26 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడింది. దీంతో భారత్ యుద్ధానికి దిగింది. పాక్ బలగాల వెన్నులో వనుకు పుట్టేలా చేసింది. ఆనాటి యుద్ధం జూలై 26న ముగియడంతో ఆ రోజును కార్గిల్ విజయ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.