కొన్ని రోజులుగా మలేషియా వేదికగా టీ 20 వరల్డ్ కప్ ఆసియా బి క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు ఉదయం చైనా మరియు మలేషియా జట్లకు మధ్యన మ్యాచ్ జరిగింది.. మొదట బ్యాటింగ్ చేసిన చైనా జట్టు కేవలం 10 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 23 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇందులో స్యాద్రుల్ ఇజ్రస్ అనే మలేషియా స్పీడ్ స్టర్ చైనాను దారుణంగా దెబ్బ తీశాడు… ఇతను నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క మేడిన్ ఓవర్ వేసి… 8 పరుగులు మాత్రమే ఇచ్చి 7 కీలక వికెట్లను తీసుకున్నాడు. దీనితో ఇజ్రాస్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.. ఇప్పటి వరకు టీ 20 చరిత్రలో 7 వికెట్లు తీసి తక్కువ గణాంకాలను నమోదు చేసుకున్న వ్యక్తిగా రికార్డ్ సాధించాడు. కాగా ఇతని తీసుకున్న వికెట్లు అన్నీ కూడా బౌల్డ్ రూపంలో వచ్చినవి కావడం మరో విశేషం.
కాగా ఇతని కన్నా ముందు విటాలిటీ బ్లాస్ట్ లో కోలిన్ అకర్మన్ 18 పరుగులకు 7 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డ్ కనుమరుగైంది.