పాకిస్తాన్ ఇన్ ఫుల్ కమాండ్: అబ్దుల్లా షఫిక్ డబుల్ సెంచరీ … !

-

పాకిస్తాన్ మరియు శ్రీలంక ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ లో పాకిస్తాన్ మ్యాచ్ పై పట్టు బిగిస్తోంది. ఈ రోజు మూడవ రోజు బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ భారీ స్కోర్ దిశగా దూసుకు వెళుతోంది. ఇప్పటికే మూడు వందలకు పైగా మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించగా ఇంకొన్ని ఓవర్ లు మాత్రమే ఆడి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చెయ్యాలని భావిస్తోంది. కాగా ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన అబ్దుల్లా షఫీక్ కాసేపటి క్రితమే కెరీర్ లోనే మొదటి సరిగా డబుల్ సెంచరీ సాధించాడు. ఇతని డబుల్ సెంచరీ సాధించడానికి 320 బంతులు తీసుకున్నాడు. ఇందులో 19 ఫోర్లు మరియు నాలుగు సిక్సులు ఉన్నాయి. ఇతనికి మసూద్ (51), షకీల్ (57) మరియు ఆఘ సల్మాన్ (76 బ్యాటింగ్) ల నుండి చక్కని సహకారం లభించింది. ఇక శ్రీలంక బౌలర్లలో ఫెర్నాండో ఒక్కడే మూడు వికెట్లు దక్కించుకున్నాడు.

ఏ క్షణమైనా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశం ఉండడంతో సల్మాన్ సెంచరీ చేస్తాడా చూడాలి. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించడం పక్కాగా తేలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news